నీరద మండల నారద తుంబుర మహతీ గానపు మహిమలు తెలిసి శితహిమకందర యతిరాట్ సభలో తపః ఫలమ్ముగ తళుకుమని తల్లి తనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాశయమ్ములో ప్రవేశించె ఆ నందకము నందనానంద కారకము అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం
పద్మావతియే పురుడు పోయగా పద్మాసనుడే ఉసురు పోయగా విష్ణుతేజమై నాద బీజమై ఆంధ్ర సాహితీ అమరకోశమై అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమ